చంద్రబాబుపై ఖచ్చితంగా విచారణ..!

చంద్రబాబుపై ఖచ్చితంగా విచారణ..!

చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని స్పస్టం చేశారు వైసీపీ సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన అంబటి రాంబాబు.. టీడీపీ సర్కార్‌తో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వచ్చిన ఆరోపణలపైనా విచార చేయిస్తామని తెలిపారు. అయితే, ఆ ప్రభుత్వం పై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశం మాత్రం తమకు లేదన్నారు. ఇక సీఎం కుమారుడు లోకేష్ ఓడిపోయినందుకు సిగ్గుపడాలంటూ ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు... 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేబినేట్ లోకి నన్ను తీసుకోవాలా? లేదా? అనే విషయంపై జగనే నిర్ణయం తీసుకుంటారన్నారు.