ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం: గోవా కాంగ్రెస్‌

ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం: గోవా కాంగ్రెస్‌

ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా గోవాలో రాజకీయం శరవేగంగా మారుతోంది. సీఎంగా పారికర్ రాజీనామా చేయరని ఆ రాష్ట్ర స్పీకర్‌ అంటున్నా.. ఢిల్లీ నుంచి సీనియర్ నేతల కీలక బృందం ఇప్పటికే గోవాకు వచ్చింది. పారికర్‌ స్థానంలో మరొకరని నియమించే అవకాశాలను పరిశీలిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌ వద్ద 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఈ మేరకు రాజ్‌భవన్‌కు ఓ లేఖను అందించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు, గవర్నర్‌ భేటీ కాలేదని తెలుస్తోంది.