ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు-ఉత్తమ్

ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు-ఉత్తమ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ గాంధీభవన్‌లో సమావేశమైన నేతలు... ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డీసీసీలకు అప్పగించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితా లేకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. చనిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను జాబితా నుండి తీసేయలేదని ఆరోపించిన ఉత్తమ్.. 6 నెలల ముందే ఎన్నికలు జరపాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. కాగా, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం కాగా... 14వ తేదీతో ముగియనుంది. ఇక ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) సెలవుదినాలు కావడంతో చివరి రెండురోజులే నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.