100 సీట్లతో గెలుస్తాం..

100 సీట్లతో గెలుస్తాం..

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. గెలుపెవరిదో తెలియాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే. ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం ఎప్పటిలాగానే విడుదలయ్యాయి. వాటి ఫలితాలెలా ఉన్నా.. విజయం మాత్రం తమదేనని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్‌ చేశారు. '3 నెలలుగా అహోరాత్రులు కష్టపడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. వివిధ ప్రాంతాల నుంచి మన పార్టీ నేతలు అందించిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో దాదాపు వంద సీట్లను గెలవబోతున్నాం' అని పోస్ట్‌ చేశారు.