నేడు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు

నేడు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఒకటి రెండు చోట్ల వడగండ్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉష్టోగ్రతలు సాధారణస్ధాయి దాటి స్వల్పంగా పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ పెరిగి 32 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణ స్ధాయి కంటే 1.5 డిగ్రీలు పెరిగి 18.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.