వెదర్ అప్‌డేట్..

వెదర్ అప్‌డేట్..

గాలులు ఆగ్నేయ దిశగా, దక్షిణ దిశగా ఉండటంతో ఆకాశం మేఘావృత్తమై ఉంటుందని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న... మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా వాతావరణ పరిస్థితులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె... గాలులు ఆగ్నేయ దిశగా, దక్షిణ దిశగా ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రేపటి నుంచి పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. రానున్న రెండు రోజుల పాటు తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా ఉంటుందని ఎన్టీవీకి తెలిపారు నాగరత్న.