14-20 అక్టోబర్‌.. ఈ వారం మీ వారఫలాలు..

 14-20 అక్టోబర్‌.. ఈ వారం మీ వారఫలాలు..

మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరం. ప్రతి పనీ శ్రద్ధతో ఆచరించండి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. బుద్ధిబలం ఉపయోగిస్తే మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. అనేక విధాలుగా మానసిక ఇబ్బందులెదురవుతాయి. ఆత్మీయుల అండతో విజయం సాధిస్తారు. పట్టుదల అవసరం. ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఈశ్వర సందర్శనం శక్తినిస్తుంది.
వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
ఈ వారం అద్భుతంగా ఉంది. తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. విశేష ధనప్రాప్తి ప్రారంభంకాబోతోంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. అధికార లాభముంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. క్రమంగా విఘ్నాలను అధిగమిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయం లాభాన్నిస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఆరోగ్యం శుభప్రదం. వేంకటేశ్వరస్వామిని స్మరించండి.
మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
మంచి ఆలోచనలతో విజయం దక్కుతుంది. కొన్ని ఘటనలు విజయానికి ఆపడానికి ప్రయత్నిస్తాయి. చర్చల ద్వారా పనులు జరుగుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించండి దగ్గరివారితో గొడవలు వచ్చే ప్రమాదం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం. వ్యాపార లాభం అనుకూలం. కొందరివల్ల మనస్తాపం చెందుతారు. వారాంతంలో శుభవార్త వింటారు. మనోబలంతో ఏదైనా సాధించగలరు. శ్రీలక్ష్మీనారాయణ స్తోత్రం శుభాన్నిస్తుంది.
కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
ఈ వారం చాలా బాగుంది. అద్భుతమైన శుభకాలం ప్రారంభం. మంచి పనులతో విజయం. గౌరవం దక్కుతుంది. ధనలాభం ఉండొచ్చు. శ్రమకు తగిన ఫలితం. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా ఉంటారు. అపోహలు తొలగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గృహలాభం సూచితం. పనులు సాఫీగా సాగుతాయి. దుర్గాధ్యానం మంచిది.
సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇదే ధోరణితో ముందుడుగు వేయండి. విజయావకాశాలు పెరుగుతాయి. కృషిని బట్టే ఫలితం. ఆర్థికంగా మిశ్రమఫలం. ధైర్యంగా మాట్లాడితే కార్యసిద్ధి సులభమవుతుంది. అవగాహనతో వ్యవహరించండి. శుభం చేకూరుతుంది. నూతనంగా ఆలోచించండి. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోండి. వివాదం వద్దు. ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్య రక్షణ అవసరం. విష్ణు స్మరణతో ఆరోగ్యం మెరుగవుతుంది.
కన్య 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
మిశ్రమ ఫలితాలున్నాయి. గతంలో చేసిన పనుల ఫలితాలు లభిస్తాయి. మంచి సంకల్పం అవసరం. ఆటంకాలు తొలగుతాయి. సంకోచించకుండా ముందడుగు వేయండి. ప్రోత్సాహం ఉన్నది. మొహమాటం పనికిరాదు. సున్నితంగా మాట్లాడటం వల్ల ఆపదలు దరిచేరవు.  కొందరు మిమ్మల్ని బాధించాలని చూస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. ఉత్సాహంతో ఆలోచించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. శుభవార్త వింటారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
అద్భుతమైన శుభయోగాలున్నాయి. సత్పురుషుల సాంగత్యంతో విజయం. అదృష్టవంతులవుతారు. మంచి పనులు చేసి పెద్దల నుంచి అభినందనలు పొందుతారు. గత వైభవం ప్రాప్తిస్తుంది. విజ్ఞాన పరమైన విజయం ఉంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దృఢమైన సంకల్పసిద్ధి ఉంది. మిత్రులకు మేలు జరుగుతుంది. సూర్యస్తోత్రం మంచిది. 
వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
ఎన్ని దోషాలున్నా విజయం వరిస్తుంది. ప్రతిభతో విజయం. పనుల్లో వేగం పెరుగుతుంది. సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. పట్టుదల అవసరం.  అదృష్టయోగముంది. పేరు ప్రఖ్యాతులొస్తాయి. ఆత్మగౌరవం పెరుగుతుంది. దగ్గరివారితో విభేదించవద్దు. మనోబలాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగంలో కార్యసిద్ధి. ఒక విషయంలో తడబాటుకు గురవుతారు. వారాంతంలో శుభవార్త వింటారు. దుర్గాదేవిని ధ్యానిస్తే మంచిది.
ధనుస్సు  
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
బాగా కష్టపడితేనే విజయం సిద్ధిస్తుంది. అశ్రద్ద వద్దు. ధనం విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా ఇస్తే తిరిగిరాదు. ఖర్చు అధికమవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభం ఉంది. పదోన్నతి ఉంది. ప్రశంసలున్నాయి. ఆటంకాలు తొలగుతాయి. కుటుంబసభ్యులకు మేలు జరుగుతుంది. గౌరవం లభిస్తుంది. ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోండి. దగ్గరివారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఒక విషయంలో ఇబ్బంది పడి.. వెంటనే సుఖాన్ని పొందుతారు. శివసందర్శనంతో ఆనందం. 
మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
అదృష్టం పడుతుంది. దైవబలం రక్షిస్తోంది. చైతన్యవంతంగా ఆలోచించండి. ఒక శుభవార్త వింటారు. ఆనంద కాలం మొదలవుతుంది. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఒక అంశం కొలిక్కి వస్తుంది. సంకల్ప బలంతో కార్యం సిద్ధిస్తుంది. బాధ్యాతాయుతంగా నడుచుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. ధనలాభం ఉంది. బంధుమిత్రుల సహకారం తీసుకోండి. శివధ్యానం ఉత్తమం.
కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
సుఖసంతోషాలతో వారం మొదలవుతుంది. చేస్తున్న పనిలో గుర్తింపు లభిస్తుంది. ధనధాన్య లాభముంది. దూరపు ప్రయాణాల్లో విజయముంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత గుర్తింపు ఉంటుంది. ధైర్యంగా మాట్లాడితే ఆపదలు తొలగుతాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అపార్థాలకు తావులేకుండా ప్రసంగించండి. సూర్యభగవానుడిని ప్రత్యక్షంగా దర్శంచండి.
మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
ఈ వారం చాలా చక్కగా ఉన్నది. అదృష్టయోగం ఉంటుంది. శుభాల వైపు అడుగులు వేస్తారు. ఒక విషయంలో అఖండ విజయం. ఆపదలు తొలగుతాయి. ఏకాగ్రతతో పనిచేసి పెద్దల ప్రశంసలందుకుంటారు. ఉద్యోగంలో శుభఫలితముంది. ధనలాభం ఉంటుంది. స్థానచలనం అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఆలోచించండి. మిత్రుల సహకారం ఉంటుంది. భవిష్యత్‌ ప్రణాళికలు ఫలిస్తాయి. ఓర్పు, సహనంతో మాట్లాడండి ప్రశాంతత లభిస్తుంది. అష్టలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
 

డా . శంకరమంచి రామకృష్ణ శాస్త్రి..