28 అక్టోబర్‌ - 3 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

28 అక్టోబర్‌ - 3 నవంబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
పనుల్లో విఘ్నాలుంటాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. దైవబలమే కాపాడుతుంది. శ్రమ ఉంటుంది. ఏకాగ్రత అవసరం. బంధుమిత్రుల సలహాలు తీసుకోవాలి. నూతన నిర్ణయాలకు సమయం కాదు. శత్రుభయం ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడాలి. ఒక వార్త శక్తినిస్తుంది. శివారాధన ద్వారా విశిష్ట ఫలితాలుంటాయి.
వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
పూర్వ పుణ్యం వల్ల అదృష్టప్రాప్తి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ధనలాభం సూచితం. మనోబలంతో విజయం సిద్ధిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. దగ్గరవారితో ఆనందంగా ఉంటారు. సంశయం లేకుండా కార్యాలు ప్రారంభించండి. విభేదాలకు అవకాశం ఇవ్వకండి. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది.
మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
గౌరవప్రదమైన జీవనం ఉంటుంది. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. ఆర్థిక యోగం అనుకూలంగా ఉంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తే సరిపోతుంది. వస్తు సేకరణ చక్కగా ఉంది. వ్యాపార లాభాలు విశేషం. ఇంట్లో ప్రశాంత జీవితం కొనసాగుతుంది. మనోబలం పెంచుకోవాలి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంది. శాంతచిత్తంతో పనిచేయండి. ఆశిస్తున్న ఒక పనిలో కార్య సాధన కనబడుతుంది. ప్రతిభతో కీర్తి లభిస్తుంది. ఇష్టదేవతారాధన శక్తికి సంకేతం.
కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
శుభయోగాలున్నాయి. చక్కని ప్రణాళికలతో పనులు ప్రారంభించిండి. ఆశయాలు నెరవేరుతాయి అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. స్థిరత్వం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. సంపదలు సమకూరుతాయి. మనోబలం చేకూరుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
గొప్ప శుభకాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తి అవుతుంది. మానసిక బలం అవసరం. అవరోధాలు తొలగుతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎదురుచూస్తున్న ఒక విజయం వరిస్తుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. ఇష్ట దైవదర్శనం శుభ సంకేతం.
కన్య 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులున్నాయి. అపనిందలున్నాయి. ప్రతి విషయాన్నీ మనసుకు తీసుకోవద్దు. కష్టాలను అధిగమించే అవకాశముంది. అవసరాలకు ధనం లభిస్తుంది. సాహసంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. శివారాధన మంచిది.
తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
నూతనోత్సాహంతో పనులు ప్రారంభించండి. ఉత్తమమైన శుభాలను పొందుతారు. ఐశ్వర్యప్రాప్తి ఉంది. పనుల్లో శ్రద్ధ పెట్టండి. ఎటు చూసినా విజయమే. అనుకూల కాలం మొదలైంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. వాక్కుతో అందరినీ మెప్పిస్తారు. ముఖ్య వ్యక్తుల సూచనలు పాటిస్తే ఆపదలు దరిచేరవు. విశేషమైన ధనలాభం ఉంది. గౌరవ పురస్కారాలున్నాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.
వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
కార్యసిద్ధి ఉంది. నిశ్చలమైన మనసుతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. కష్టాల నుంచి బయటపడతారు. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే సమస్యలు దరిచేరవు. ప్రసన్నంగా మాట్లాడండి. కొందరు మోసం చేయాలని చూస్తారు. కలహాలకు అవకాశముంది. బంధువులతో జాగ్రత్త. ధర్మమునందు చక్కని ప్రణాళిక అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్సును పెంచుతుంది. 
ధనుస్సు  
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
విజయాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. శ్రద్ధగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సహనం పరీక్షిస్తుంది. అపార్థాలకు తావివ్వరాదు. మనోబలం ప్రధానం. ఆశయ సిద్ధి ఉంది. నమ్మకంగా ముందుకుసాగండి. అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా.. సమర్థంగా పనిచేస్తే ప్రశంసలూ ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. వారాంతంలో లాభం ఉంది. పని ప్రారంభించేముందు ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి.
మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఉత్సాహంగా కాలం మొదలవుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారబలం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మిత్రులతో కలిసి ఒక మంచి పనిచేస్తారు. విఘ్నాలున్నా బుద్ధిబలంతో  అధిగమిస్తారు. విశేషమైన కార్యసిద్ధి ఉంది. మీరు చేసిన ఒక మంచి ఇప్పుడు అక్కరకు వస్తుంది. ప్రశాంతమైన జీవనం కొనసాగుతారు. దుర్గాధ్యానం ద్వారా ఆపదలు తొలగుతాయి.
కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
శుభఫలితాలున్నాయి. ప్రయత్నాల్లో లోపం లేకండా పనులు ప్రారంభించండి. శక్తివంచన లేకుండా పనిచేయండి. ఉత్సాహంగా నిర్ణయం తీసుకోండి. న్యాయపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధన లాభాలున్నాయి. గౌరవం పెరగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. ప్రశంసించే కూడా వారున్నారు. ఖర్చు పెరుగుతుంది. వాద ప్రతివాదాలకు తావివ్వొద్దు.  శుభవార్త ఆనందాన్నిస్తుంది. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.
మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
అదృష్టయోగం పరిపూర్ణం. విశేషమైన శుభకాలం. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. అనుకున్నది దక్కుతుంది. కొత్తకొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగపరమైన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి వార్త ఉన్నది. గురువుల కృపాకటాక్షాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు సాగండి. ఆదిత్య హృదయం పఠించుకోవాలి.