21-27 అక్టోబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

21-27 అక్టోబర్‌.. ఈ వారం మీ వారఫలాలు

మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. ఆవేశపూరిత నిర్ణయం ఉండరాదు. ఏది ఊహిస్తారో అదే జరుగుతుంది. సహాయ సహకారాలు  అందుతాయి. అభినందించేవారు పెరుగుతారు. ఒత్తిడి ఎంతఉన్నా పనిలో నిదానంగా పనిచేయండి. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. కలహాలున్నాయి.. అనవసరమైన విషయాలు గుర్తొచ్చి  మనశ్శాంతి తగ్గుతుంది. నిగ్రహంతో వ్యహస్తరిస్తేనే సర్దుకుంటాయి. ముఖ్య వ్యక్తుల సూచనలతో ఆనందం సిద్ధిస్తుంది. గురుగ్రహ సందర్శనం శుభప్రదం. శనగలు దానం మంచిది. శివారాధన మేలు  చేస్తుంది.

వృషభం:
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
ఐదు గ్రహాలూ సహకరిస్తున్నాయి కావున శుభకాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. అవకాశాలను సద్వివినియోగం చేసుకోండి. మంచి ఆలోచనలు కలుగుతాయి. మనసు ప్రశాంతంగా  ఉంటుంది. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గతంలో వేధించిన కొన్ని సమస్యలు ఇప్పుడు తొలగిపోతాయి. ధనయోగముంది. నూతన వస్తు వాహన యోగాలున్నాయి. ఆనందించే విషయాలు  కొన్ని చోటుచేసుకుంటాయి. దగ్గరివారి సహకారం పూర్తిగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం మంచింది. నువ్వుల దానం మంచిది.

మిథునం:
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
ఒక గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఆర్ధిక అంశాలు అనుకూలిస్తాయి. మంచి ఆలోచనలతో విజయం దక్కుతుంది. కొన్ని ఘటనలు విజయానికి ఆపడానికి ప్రయత్నిస్తాయి. ఏమాత్రం  చింతించరాదు. దగ్గరివారితో గొడవలు వచ్చే ప్రమాదం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం. వ్యాపార లాభం అనుకూలం. కొందరివల్ల మనస్తాపం చెందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  వారాంతంలో మేలు జరుగుతుంది. సాయినామాన్ని స్వరిస్తే శ్రేయస్సు పెరుగుతుంది. నవగ్రహ సందర్శన మంచిది. గోధుమలు దానం చేస్తే మంచి ఆలోచనలు కలుగుతాయి.

కర్కాటకం:
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
నాలుగు గ్రహాలూ అనుకూలం. అదృష్టకాలం ఆరంభమయింది. ఏది సంకల్పిస్తారో అదే జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవం దక్కుతుంది. ధనలాభం ఉండొచ్చు. మిత్రుల సహకారం  అందుతుంది. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మంచి వాతావరణంలో జీవిస్తారు. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. అధికారుల నుండి  ప్రశంశలు. దైవబలం పూర్తిగా ఉంది. పనులు సాఫీగా సాగుతాయి. సూర్యారాధన మంచిది. బియ్యం దానం చేస్తే మనో బలం వృద్ధిచెందుతుంది.

సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
ఐదు రాశులు సహకరిస్తున్నాయి. విశేషమైన కార్యసిద్ధి ఉంది. ప్రతి అవకాశాన్నీ విజయంగా మలచుకోండి. శుభప్రదమైన ఫలితాలున్నాయి. ఏకాగ్రతతో విజయం వరిస్తుంది. ఇంటా బయటా  అనుకూల ఫలితాలున్నాయి. సాహసంతో చేసే పనులు మేలు చేస్తాయి. ధర్మ మార్గంలో ప్రయాణిస్తే న్యాయం జరుగుతుంది. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల  సూచనలు ఫలిస్తాయి. సొంత నిర్ణయంకన్నా ఆత్మీయుల సలహా బాగా పనిచేస్తుంది. ఒక ఆపద నుండి బయటపడతారు. ఇష్టదేవతారాధన శుభాన్నిస్తుంది. సూర్యానారాణయ మూర్తి సందర్శిస్తే  మంచిది. నువ్వుల దానం మేలు చేస్తుంది.

కన్య:
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
నాలుగు గ్రహాలు రక్షిస్తున్నాయి. విజయావకాశాలు పెరుగుతాయి. అభీష్టాలు నెరవేరతాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకుసాగండి. తగినంత  విశ్రాంతి అవసరం. వస్తుసేకరణ చేస్తారు. రావలసిన ధనం వస్తుంది. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బందేమీ లేదు. శాంతియుతంగా కాలం నడుస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. అనుకున్నది వారాంతంలో  సిద్ధిస్తుంది. ఇష్టదైవ స్మరణ కార్యసిద్ధినిస్తుంది. శివ సందర్శనం మంచిది. గోధుమలు దానం చేయండి.

తుల: 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
తిరుగులేని శుభకాలమిది. శీఘ్ర విజయప్రాప్తి ఉంది. జాగ్రత్తగా కాలాన్ని అదృష్టం వైపు మలచుకోవాలి. మేలుచేసే వారున్నారు. ఇప్పుడు చేసే పనులు రేపటి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఆ దిశగా  అడుగులు వేయండి. మంచి జరుగుతుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. అభిమానించే వారున్నారు. గౌరవం లభిస్తుంది. ప్రశంసలందుకుంటారు. వాహన గృహ భూయోగాలున్నాయి.  గొప్పవారు అవుతారు. ప్రమానురాగాలను పొందుతారు. శ్రీ మహా గణపతి ఆరాధన కార్యసిద్ధినిస్తుంది. గణపతి సందర్శనం మంచిది. బియ్యం దానం మంచిది. 

వృశ్చికం:
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
రెండు రాశులు సహకరిస్తున్నాయి. సాహసంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. తొందర వద్దు. మనోబలం పూర్తిగా అవసరం. ఇంట్లోవారి సలహాతోనే నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా మిశ్రమకాలం.  ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదముంది. లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. బుద్ధిబలం బాగుంది. ఆపదలున్నాయి. ఎటువంటి ప్రమాదం  జరగదు. విష్ణుమూర్తిని ధ్యానించండి. విష్ణుమూర్తి సందర్శనం మంచిది. నవధాన్యం అగ్నిహోత్రికి సమర్పించండి.

ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
నాలుగు గ్రాహాలు అనుకూలిస్తున్నాయి. శుభఫలితం ఉంది. జాగ్రత్తగా పనులు ప్రారంభించండి. మనోధర్మాన్ని పాటించండి. మనసు చెప్పిందే చేయండి. విజయం త్వరగా సిద్ధిస్తుంది.  విఘ్నాలున్నాయి. బుద్ధిబలంతో వాటిని ఛేదించండి. ఎవరి మాటలూ పట్టించుకోవద్దు. లక్ష్యం మీద దృష్టిపెట్టండి. ఆవేశం పనికిరాదు. సమయానికి అన్నీ జరుగుతాయి. ఫలితం సానుకూలంగా  ఉంటుంది. మనస్సులో ఎటువంటి సంకోచం కలిగినా శ్రమ పెరుగుతుంది. అలా లేకుండా చూచుకుంటే వారాంతంలో ఫలితాలు లభిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది. నువ్వుల  దానం మంచిది. 

మకరం:
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
ఆర్థికంగా పుంజుకుంటారు. సమయానికి పనులు పూర్తి అవుతాయి. తగినంత శ్రమ అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. గౌరవమూ, గుర్తింపూ పెరుగుతాయి. పనుల్లో ఏకాగ్రత పెట్టండి.  ఒక శుభవార్త శక్తినిస్తుంది. కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహంగా ఉంటారు. నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. శత్రుదోషం ఉంది. ఆచితూచి మాట్లాడండి. వారాంతంలో ఉత్తమ  ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. శ్రీ నృసింహస్వామిని ధ్యానించండి. కందుల దానం మంచిది.

కుంభం: 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
నాలుగు గ్రహాలూ అనుకూలం. అనుకున్నది దక్కుతుంది. నిరాశ లేకుండా ఉత్సాహంతో ముందడుగు వేయాలి. అవసరాలకు ధనం అందుతుంది. గృహలాభం ఉంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. తగినంత  శ్రమ కూడా అవసరం. ధైర్యంగా మాట్లాడాలి. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే విజయం చేరువలోనే ఉంది. నిర్మల మనస్సుతో నిర్మాణం తీసుకోండి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. బంధుమిత్రులతో  ఆనందంగా గడుపుతారు. శుభవార్త శక్తినిస్తుంది. ఒక మేలు జరుగుతుంది. ఆంజనేయస్వామిని దర్శించండి. శనగలు దానం చేయండి.

మీనం: 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
నాలుగు గ్రహాలూ అనుకూలం. అత్యంత అనుకూల శుభకాలం. ఏకాగ్రతతో విజయం సిద్ధిస్తుంది. నమ్మకముతో ముందుకు సాగండి. దగ్గరివారి సహాయం అందుతుంది. ఒక ఆపద నుంచి  బయటపడతారు. ఇబ్బందులున్నా చాకచక్యంతో అధిగమిస్తారు. దైవబలం రక్షిస్తోంది. ఉత్తమ ఆలోచనా విధానంతో అభివృద్ధి చెందుతారు. క్రమంగా శుభకాలం మొదలవుతుంది. మనస్సులోని  కోరికలకు ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యారాధన ఉత్తమం. గోధుమలు దానం చేయండి.