2 - 8 డిసెంబర్.. ఈ వారం మీ వారఫలాలు

2 - 8 డిసెంబర్.. ఈ వారం మీ వారఫలాలు

మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
వారం మధ్యలో చేపట్టిన పనులు ఓ కొలిక్కి వస్తాయి. పట్టువిడవకుండా పనుల్లో ఏకాగ్రత పెంచండి. కుటుంబసభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో వాళ్లను సంప్రదించడం మంచిది. సమష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి.  ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది.
వృషభం:
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. విందూ వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో  శ్రద్ద అవసరం. సూర్య ఆరాధన శక్తినిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. సుఖసంతోషాలున్నాయి. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరులతో జాగ్రత్త. అవసరాలకు ధనం లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.
కర్కాటకం: 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
విజయం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. కీర్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలం. ఒక పనిలో లాభం పొందుతారు. కొన్ని విషయాల్లో మిత్రుల ప్రమేయం అవసరం. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం  చదవండి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
ప్రయత్నం చేయండి.. విజయం సొంతమవుతుంది. ధనధాన్య లాభాలున్నాయి. సాహసోపేతమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. అనుకోని ధనవ్యయం ఉంది. వ్యాపార యోగముంది. ఇతరులతో జాగ్రత. ప్రయాణ సూచనలున్నాయి.  శివారాధన చేయండి. 
కన్య: 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
శుభకాలం నడుస్తోంది. ఒక ముఖ్య పని పూర్తి అవుతుంది. ఇతరుల నుండి తగినంత సహకారం లభిస్తుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. 
ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. ఓర్పుతో పనులు పూర్తిచేయండి. విష్ణు స్మరణ మంచిది.
తుల:
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
అనుకూల ఫలితాలున్నాయి. కోరుకుంది లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. పనులు ఇప్పుడు పరిష్కారమవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. లక్ష్మీధ్యానం  చేయండి.
వృశ్చికం: 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
శ్రమించి విజయాన్ని పొందుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అడుగడుగునా విఘ్నాలున్నాయి. అధిక వ్యయం. దైవబలం కాపాడుతోంది. ఇంతకుముందు కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. కుటుంబసభ్యుల సూచనలు  పాటించండి. ఇష్టదైవాన్ని స్మరించండి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
 ధైర్యంగా పనులు చేయండి. విజయం లభిస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎవరు ఇబ్బంది కలిగించినా సహనంతో ముందడుగు వేయండి. పట్టుదలతో చేస్తే లాభాలు వస్తాయి. వారం మధ్యలో ప్రశాంతత చేకూరుతుంది. మౌనం  మంచిది. శివారాధన చేయండి. 
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
మంచి విజయం లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. అవసరానికి సహకారం లభిస్తుంది. ఆస్తిపరంగా అభివృద్ధి ఉంది. వ్యయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన మంచిది.
కుంభం:
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
అదృష్టయోగముంది. కొన్నిపనులు ముందుకు సాగవు. సంకల్పబలంతో విజయం లభిస్తుంది. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఫలితం చేజారుతుంది. పెద్దల మన్ననలు పొందుతారు. ఇంటా బయటా కీర్తి, ప్రశంసలు. ప్రయాణ లాభముంది. ఆరోగ్యం  శుభప్రదం. దుర్గారాధన చేయండి.
మీనం:
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
 కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు పదిమందికీ మేలు చేస్తాయి. విందూవినోదాలలో పాల్గొంటారు. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దూరపు బంధువులను కలిసే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన మంచిది.