జనవరి 6-12.. ఈ వారం మీ వారఫలాలు

జనవరి 6-12.. ఈ వారం మీ వారఫలాలు

మేషం:
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
అధిక శ్రమ అవసరం. అధికారుల నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక వ్యయం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఇబ్బందులు  ఎదురయ్యే అవకాశాలున్నాయి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
వృషభం: 
కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు 
విజయం లభిస్తుంది. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ఉద్యోగ బలం బాగుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్త వింటారు. వస్తు, వస్త్రప్రాప్తి ఉంది.  ప్రయాణాల్లో పాల్గొంటారు. శుక్రగ్రహ శ్లోకం పఠించండి.
మిథునం:
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
సహాయ సహకారాలందుతాయి. కొన్ని విషయాల్లో ముందస్తు ఆలోచనలు అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠలున్నాయి.. అలాగే అవమానాలున్నాయి. వారం మధ్యలో కలిసివస్తుంది.  ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అయితే తగిన పరిష్కారం లభిస్తుంది. విష్ణు దర్శనం లాభాన్నిస్తుంది.
కర్కాటకం: 
పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష 
 ధన లాభముంది. అదృష్టయోగముంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్నిస్తాయి. శ్రద్ధతో పనిచేసి అధికార లాభాన్ని పొందుతారు. వాహన, గృహ యోగాలున్నాయి. శుభకార్యాలు చేస్తారు.  ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సూర్యస్తుతి ఉద్యోగ యోగాన్నిస్తుంది.
సింహం:
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆశయం నెరవేరుతుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు విజయంను అందిస్తాయి. సంపదలు సమకూరతాయి. దైవబలం ఉంది. కుటుంబ కలహాలు ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక  సమస్యలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా ధ్యానం రక్షిస్తుంది.
కన్య:
ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు 
ధనధాన్య లాభముంది. చేసే పనులు ఫలిస్తాయి. వ్యాపారంలో కలిసివస్తుంది. ఇతరులతో మొహమాటపడకుండా మాట్లాడాలి. విఘ్నాలను అధిగమిస్తారు. ఒక పని పూర్తి అవుతుంది. శబంధువులను  కలుస్తారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. నిశ్లోకం చదవండి.
తుల:
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
విజయం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. బంధుమిత్రుల్ని కలుస్తారు. గతంలో పనులు ఇప్పుడు పూర్తిచేస్తారు. ఎదురుచూస్తున్న విజయం వరిస్తుంది. విందువినోదాల్లో  పాల్గొంటారు. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం.
వృశ్చికం: 
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ 
అనుకూల కాలం. విజయాలు వరిస్తాయి. సాహసోపేత నిర్ణయం లాభాన్నిస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. గృహ, వాహన లాభాలున్నాయి. వారంలో శుభవార్త వింటారు. ఆరోగ్య విషయంలో  జాగ్రత్త. ఆదిత్య హృదయం శక్తిని ప్రసాదిస్తుంది.
ధనుస్సు: 
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
విజయాల్ని సొంతం చేసుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలున్నాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకున్నది దక్కుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది.  వారాంతంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసిరాకపోవచ్చు. ఆదిత్య హృదయం చదువుకోవాలి.
మకరం:
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆర్థికంగా కలిసి వస్తుంది. అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎదురుచూస్తున్న ఒక విజయం ఈ వారంలో దక్కుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. గణపతి  దర్శనం మంచిచేస్తుంది.
కుంభం: 
ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక విజయాలున్నాయి. డబ్బుల విషయంలో పొదుపు  అవసరం. సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
మీనం:
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
శుభకార్యాలు జరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. అధికార లాభముంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనుల్లో అశ్రద్ధ చేయకండి. గతంలో కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం  బాగుంటుంది. దూర ప్రయాణ అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య దర్శనం అదృష్టాన్ని పెంచుతుంది.