ఈసీకి దీదీ లేఖ‌.. నాలుగు సార్లు వ‌ద్దు..

ఈసీకి దీదీ లేఖ‌.. నాలుగు సార్లు వ‌ద్దు..

ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎనిమిది ద‌శ‌లుగా నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. అయితే, ఇప్ప‌టికే నాలుగు ద‌శ‌ల పోలింగ్ ముగిలియ‌గా.. మ‌రో నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంది.. ఇదే స‌మ‌యంలో.. క‌రోనా సెకండ్ వేవ్ క‌ల‌వ‌ర‌పెడుతోంది.. దీంతో.. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లేఖ‌రాశారు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ..  కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నాలుగు దశల ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని.. ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా తీవ్రత ఘోరంగా ఉందని, అందుకే ఒకే దశలో ఎన్నిక‌లు నిర్వహించాలని కోరారు.. అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించాలన్న ఈసీ నిర్ణయాన్ని ఈ పరిస్థితుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. కరోనా దృష్ట్యా.. మిగిలిన ఎన్నికల దశలను ఒకే దశలో నిర్వహించ‌డం మంచిద‌ని.. అలా చేస్తే ప్రజలు కరోనా బారిన ప‌డ‌కుండా కాపాడిన వారమవుతాం అని పేర్కొన్నారు మ‌మ‌తా బెన‌ర్జీ.