మమతా బెనర్జీ దీక్ష విరమణ 

మమతా బెనర్జీ దీక్ష  విరమణ 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీక్ష విరమించారు. ఆమె గత రెండ్రోజులుగా సెవ్ ఇండియా పేరుతో కేంద్రంపై నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కలకత్తా సీపీ రాజీవ్ కుమార్ ను సీబీఐ అరెస్ట్ చేసేందుకు రావటంతో రేగిన వివాదం... ఆమె దీక్షకు కారణమైంది.  కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు కలకత్తాకు  వెళ్లి మమతను పరామర్శించారు. అనంతరం ఆమె దీక్ష విరమించారు.