ఎలక్ట్రిక్ స్కూటర్ పై మమత...పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా... 

ఎలక్ట్రిక్ స్కూటర్ పై మమత...పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా... 

పశ్చిమ బెంగాల్ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.  మమత కోటను ఢీకొట్టి బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మమత వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.  పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కోల్ కతా వీధుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ పై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.  పెట్రోల్, డీజిల్ కార్లలో తిరగలేమని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో తాను ఎలక్ట్రిక్ స్కూటర్ పైనే తిరుగుతున్నానని ప్రచారం చేస్తున్నారు.  కేంద్రంలోని బీజేపీ ధరలను నియంత్రించడంలో విఫలం అయ్యినట్టు మమత పేర్కొన్నారు.  కోల్ కతా మేయర్ ఎలక్ట్రిక్ బైక్ ను నడపగా, మమత బెనర్జీ స్కూటర్ పై కూర్చొని కోల్ కతా వీధుల్లో ప్రయాణం చేసారు.  మాస్క్ ధరించి స్కూటర్ పై ప్రయాణం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.