రాజధానిపై మమత సంచలన వ్యాఖ్యలు... 

రాజధానిపై మమత సంచలన వ్యాఖ్యలు... 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సువిశాలమైన భారత దేశానికి ఒక్క రాజధాని ఉండటం సమంజసం కాదని, నాలుగు దిక్కుల్లో నాలుగు రాజధానులు ఉండాలని, రొటేషన్ పద్దతిలో నాలుగు రాజధానుల నుంచి పరిపాలన సాగాలని, పార్లమెంట్ లో దీనిపై ఎంపీలు పట్టుబట్టాలని మమతా బెనర్జీ పట్టుబట్టారు.  రాజకీయాలప్పుడే నేతాజీ గుర్తుకు వస్తారని, నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన బాధ్యత ఉందని, కనీసం చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.  ఒకే నాయకుడు- ఒకే దేశం విధానం మారాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.