అమిత్ షా రథయాత్రకు బ్రేక్

అమిత్ షా రథయాత్రకు  బ్రేక్

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూచ్ బిహార్ నుంచి చేపట్టదలచిన రథయాత్రకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మత ఉద్రిక్తతలు పెరగవచ్చనే కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు బెంగాల్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా జనరల్ కలకత్తా హైకోర్టుకు తెలియజేశారు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన అమిత్ షా రథయాత్రకు కూచ్ బిహార్ ఎస్పీ అనుమతి ఇవ్వలేదని కిషోర్ దత్తా కోర్టుకు తెలిపారు. ‘రథయాత్ర వల్ల స్థానికంగా మత ఉద్రిక్తతలు పెరగవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని‘ ఆయన చెప్పారు. దీంతో ఏకీభవించిన కలకత్తా హైకోర్ట్ కూడా రథయాత్రకు అనుమతి నిరాకరించింది.

ఏదైనా అనుకోనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న జడ్జి ప్రశ్నికు, బీజేపీ తరఫు న్యాయవాది అనింద్య మిత్ర శాంతిభద్రతలు కాపాడటమనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని జవాబిచ్చారు. అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ బీజేపీ అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయడంపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు. కొత్త పిటిషన్ గా కానీ, తన పిటిషన్ కు సవరణగా కానీ రావాలి తప్ప అనుబంధ అఫిడవిట్ చెల్లదని ఆయన వాదించారు