రోజులో నాలుగు గంటలు ఆ షాపులు తెరిచే ఉంటాయి.... 

రోజులో నాలుగు గంటలు ఆ షాపులు తెరిచే ఉంటాయి.... 

కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని షాపును బంద్ అయ్యాయి.  నిత్యవసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు మినహా అన్ని బంద్ అయ్యాయి.  వీటిని కూడా తెరవడం లేదు.  ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.  ఈలోగా కరోనా వైరస్ ను ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు.  

ఇదిలా ఉంటె బెంగాల్ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయం ప్రకారం, లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్వీట్ షాపులను రోజుకు నాలుగు గంటలపాటు తెరిచే ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజుకు నాలుగు గంటల పాటు ఈ స్వీట్ షాపులు తెరిచే ఉండబోతున్నాయి.