హింసాత్మకంగా మారిన అమిత్ షా రోడ్ షో

హింసాత్మకంగా మారిన అమిత్ షా రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  నిర్వహించిన రోడ్‌ షో హింసాత్మకంగా మారింది. ప్రశాంతంగా ముందుకు సాగుతున్న రోడ్ షోలో ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. ర్యాలీలో కొంతమంది కార్యకర్తలు ఒకరిపై మరొకరు కర్రలు విసురుకున్నారు. మరికొంతమంది రాళ్లతో దాడికి దిగారు. కొందరు అమిత్‌ షా వాహనంపైకి కర్రలు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.