కేరళకు మమత బెనర్జీ రూ.10 కోట్లు సాయం

కేరళకు మమత బెనర్జీ రూ.10 కోట్లు సాయం

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించింది. పలు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకోవాలంటూ సీఎం పినరయి విజయన్ చేసిన విన్నపానికి పలు రాష్ట్రాలు సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తరుపున రూ.10 కోట్ల నిధులను అందిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో కేరళ ప్రజలు పడుతున్న కష్టాలు నా హృదయాన్ని కలిచివేస్తున్నాయి. వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 కోట్లు ప్రకటిస్తున్నాము. ఎలాంటి సహాయం కావాలన్న చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే పీకల్లోతు నీటిలో చిక్కుకుపోయిన కేరళకు మరో హెచ్చరిక. రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు వర్షపాతం తీవ్రత తగ్గిందని, అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చని తెలిపింది. సోమవారం నుంచి భారీ వర్షాలు ఉండకపోవచ్చని వెల్లడించింది.