బహుశా.. లాక్ డౌన్ తర్వాత జరగబోయే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావచ్చు...!

బహుశా.. లాక్ డౌన్ తర్వాత జరగబోయే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావచ్చు...!

కరోనా వైరస్ కారణంగా అని క్రీడలతో పాటుగా క్రికెట్ కూడా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం అని దేశాలు తమ లాక్ డౌన్ లో ఇస్తున్న సడలింపుల కారణంగా మళ్ళీ క్రికెట్ ను తిరిగి ప్రారంభించాలని అని దేశాల క్రికెట్ బోర్డులు చుస్తునాయి. ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్ సిరీస్‌కు క్రికెట్ వెస్టిండీస్ (సిడబ్ల్యుఐ) ఆమోదం తెలిపింది. జూన్ లో వెస్టిండీస్ మూడు మ్యాచ్ల  కోసం ఇంగ్లాండ్ సందర్శించాల్సి ఉంది, కరోనా మహమ్మారి కారణంగా పర్యటన వెనక్కి తగ్గింది. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఇప్పుడు జూలైలో ఈ సిరీస్‌ను ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూస్తోంది. ఆటగాళ్ళు మరియు సిబ్బందిని సురక్షిత వాతావరణంలో ఉంచడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది, అయితే అన్ని మ్యాచ్‌లు 'క్లోజ్డ్ డోర్స్ వెనుక' ఆడబడుతున్నాయి" అని సిడబ్ల్యుఐ తెలిపింది. అయితే ఈ పర్యటన జరగడానికి ప్రభుత్వ మంత్రులతో ఇసిబి కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అయితే బహుశా.. లాక్ డౌన్ తర్వాత జరగబోయే మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ నిర్వహించడం కోసం రెండు దేశాల బోర్డులు చాల ఆసక్తి చుపిస్తున్నాయి.  చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.