నిరాశపర్చిన గేల్.. అయినా భారీ స్కోర్..

నిరాశపర్చిన గేల్.. అయినా భారీ స్కోర్..

ఐసీసీ వరల్డ్ కప్‌ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్థాన్ పై టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్... ఆ జట్టు ముందు భారీ టార్గెట్ పెట్టింది. ఓవైపు ఓపెనర్ క్రిస్ గేల్ విఫలమైనా... షై హోప్‌ 77, లూయిస్ 58, పూరన్‌ 58, హోల్డర్‌ 45 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది వెస్టిండీస్ జట్టు. ఇక తన కెరీర్‌లో ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్ ఆడిన క్రిస్ గేల్‌పై భారీ అంచనాలున్నా.. 7 పరుగుల మాత్రమే చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడిన గేల్.. మొత్తంగా 18 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ బాదాడు. మొత్తానికి 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. చివరి మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకున్న వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బాదేయడంతో 311 పరుగుల చేసి... ఆఫ్ఘనిస్థాన్ జట్టు ముందు 312 పరుగులు భారీ టార్గెట్‌ను పెట్టింది వెస్టిండీస్.