బంగ్లా ముందు భారీ టార్గెట్...

బంగ్లా ముందు భారీ టార్గెట్...

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో బంగ్లా ముందు భారీ టార్గెట్ పెట్టింది విండీస్ జట్టు... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు.. వెస్టిండీస్‌కు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన విండీస్ 321 పరుగులు చేసి... బంగ్లా ముందు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఇక, వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు ఇదే అత్యధిక స్కో్ర్ కావడం మరో విశేషం. విండీస్ బ్యాటింగ్‌లో హోప్ 96, లివీస్ 70, హెట్మేర్ 50, హోల్డర్ 33 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌లో భాగస్వాములయ్యారు. ఇక, మ్యాచ్‌లో ఆరంభంలో అదరగొట్టిన విండీస్‌ బ్యాట్స్‌మెన్‌... బంగ్లా బౌలర్లు ధాటిగా ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కానీ, కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోడంతో మరింత భారీ స్కోరు చేసే అవకాశం చేజారిపోయింది. బంగ్లా బౌలర్లలో సైపుద్దీన్‌ (3/72), ముస్తాఫిజుర్‌(3/59), షకిబ్‌(2/54) ప్రదర్శనతో విండీస్ బ్యాటింగ్ జోరును కట్టడిచేశారు.