విక్టరీతో వెస్టిండీస్‌ బైబై..

విక్టరీతో వెస్టిండీస్‌ బైబై..

వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 311/6 పరుగులు చేసింది. షై హోప్‌ (77; 92 బంతుల్లో 6x4, 2x6), లూయిస్‌ (58; 78 బంతుల్లో 6x4, 2x6), పూరన్‌ (58; 43 బంతుల్లో 6x4, 1x6), హోల్డర్‌ (45; 34 బంతుల్లో 1x4, 4x6) పరుగులతో రాణించారు. ఆఫ్గాన్‌ బౌలర్లలో జద్రాన్ 2 వికెట్లు తీశాడు. సిర్జాద్, నబీ రిషాద్ ఖాన్ తలో వికెట్ తీశారు. 

311 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆఫ్గనిస్థాన్‌.. ఐదు పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో  ఇక్రమ్‌ అలిఖిల్‌ (86; 93 బంతుల్లో 8x4), రెహ్మత్‌ షా (62; 78 బంతుల్లో 10x4) రెండో వికెట్‌కు 133 పరుగులు చోడించారు. ఒక దశలో 189/2తో ఉన్న ఆఫ్గాన్‌.. ఐదు పరుగుల తేడాలో రెండు వికెట్లు పడడంతో జోరుకు కళ్లెం పడింది. చివర్లో అస్ఘర్‌ (40; 32 బంతుల్లో 4x4, 1x6) ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. విండీస్ బౌలర్లలో బ్రెత్‌వైట్ 4 వికెట్లు తీశాడు. రోచ్ 3 వికెట్లు, గేల్ 1 వికెట్ పడగొట్టారు.