టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా మాంచెస్టర్ లో కాసేపట్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో రాణిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్ లో విండీస్ ను ఓడించి సెమిస్ కు చేరుకోవాలని భావిస్తుంది. వెస్టిండీస్ కు మాత్రం ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

భారత్, వెస్టిండీస్‌ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్‌... 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్‌ల్లో భారత్, మూడు మ్యాచ్‌ల్లో విండీస్‌ గెలిచాయి.