వరల్డ్‌కప్‌: గేల్‌కు ఇదే చివరి మ్యాచ్...!

వరల్డ్‌కప్‌: గేల్‌కు ఇదే చివరి మ్యాచ్...!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇవాళ మరో నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే వరల్డ్ కప్‌ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్-ఆఫ్ఘనిస్థాన్ జట్లు... ఇవాళ చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఆఖరి మ్యాచ్‌ ఆడుతుండగా... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది వెస్టిండీస్ జట్టు. ఇక, విధ్వంసంకరమైన ఇన్నింగ్స్‌లకు పెట్టిందిపేరైన క్రిస్ గేల్‌... వరల్డ్ కప్‌లో ఆడనున్న మ్యాచ్ కూడా ఇదే. మరోవైపు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘనిస్థాన్... ఎనిమిదింటిలోనూ ఓడి... పాయింట్లు ఏమీ లేకుండా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానానికి పడిపోయింది. ఇక, ఎనిమిది మ్యాచ్‌లు ఆడి.. ఒక మ్యాచ్‌లో గెలిచి.. ఒక మ్యాచ్ వర్షంకారణంగా నిలిచిపోవడంతో వెస్టిండీస్ జట్టు మూడు పాయింట్లతో ఆఖరి నుంచి రెండో స్థానం ఉంది. మరోవైపు చివరి మ్యాచ్‌లోనైనా సత్తా చాటి పరువు నిలుపుకోవాలని ఆఫ్ఘనిస్థాన్ జట్టు పట్టుదలతో ఉండగా... ఈ మ్యాచ్‌లో గెలిచి మరో రెండు పాయింట్లు సాధించి.. ఐదు పాయింట్లతో సౌతాఫ్రికా జట్టుకు సమంగా నిలవాలని వెస్టిండీస్ జట్టు చూస్తోంది.