వరల్డ్‌కప్: టాస్ గెలిచిన వెస్టిండీస్
ప్రపంచ్‌కప్‌లో ఇవాళ వెస్టిండీస్‌తో పాకిస్థాన్ తలపడుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్టార్ బౌలర్ మహ్మాద్ అమీర్ ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయబోతుండగా సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు.. గాయాల కారణంగా ఎవిన్ లూయిస్, షానన్ గాబ్రియెల్‌లు విండీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. స్వింగ్‌తో మ్యాజిక్ చేసే బౌలర్లు పాకిస్థాన్ జట్టులో ఉండగా.. ఎటువంటి బౌలింగ్‌నైనా చీల్చిచెండానే హార్డ్ హిట్లర్లు విండీస్ జట్టులో ఉండడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)