వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన విండీస్‌

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన విండీస్‌

వరల్డ్‌ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌ నుంచి తడబడుతున్న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌ ఇవాళ పోటీ పడుతోంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. విండీస్‌ జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రసెల్‌తోపాటు లూయీస్‌ల స్థానంలో బ్రావో, రోచ్‌లకు చోటు దక్కింది. సౌతాఫ్రికా జట్టులో మార్క్‌రమ్‌, హెండ్రిక్స్‌లకు స్థానం లభించింది.