'మంచి అన్న ఎలా ఉండాలంటే..' రాహుల్ వివరణ

'మంచి అన్న ఎలా ఉండాలంటే..' రాహుల్ వివరణ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ..తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్ ఛార్జి ప్రియాంక గాంధీ శనివారం అనుకోకుండా ఒక విచిత్రమైన ప్రదేశంలో ఎదురుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న అన్నాచెల్లెళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ కాన్పూర్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు.

ప్రియాంకను కాన్పూర్ విమానాశ్రయంలో కలుసుకున్న వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేస్తూ రాహుల్ గాంధీ 'కాన్పూర్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంకను కలుసుకోవడం చాలా బాగుంది. మేమిద్దరం యుపిలో వేర్వేరు సభలకు వెళ్తున్నాం' అని రాశారు. ఆ వీడియోలో రాహుల్, ప్రియాంకలు ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకొని నిలబడి కెమెరా ముందు మాట్లాడుతున్నారు. 'ఒక మంచి అన్న అంటే ఎలా ఉండాలో చెప్పనివ్వండి. నేను సుదీర్ఘకాలం ఎంతో దూరం ప్రయాణిస్తున్నాను. అది కూడా ఇరుకుగా ఉండే ఒక చిన్న హెలీకాప్టర్ లో. నా చెల్లెలు తక్కువ దూరాలు ప్రయాణిస్తోంది. ఆ ప్రయాణం కూడా చాలా పెద్ద హెలీకాప్టర్ లో. కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను' అని రాహుల్  చెప్పారు. దానికి ప్రియాంక వెంటనే 'అది నిజం కాదు' అని అంటున్నారు.

ఆ వెంటనే వాళ్లిద్దరూ విడిపోయారు. పైలట్లతో ఫోటో తీయించుకొనేందుకు మళ్లీ వచ్చి పోజిచ్చారు. ఆ తర్వాత హత్తుకున్నారు. ప్రియాంక తన హెలీకాప్టర్ వైపు నడవగా రాహుల్ గాంధీ తన హెలీకాప్టర్ ఎక్కేశారు.