ముగింపు దిశగా 'మహా' సంక్షోభం.. 

ముగింపు దిశగా 'మహా' సంక్షోభం.. 

మహారాష్ట్రలో బీజేపీ... శివసేన పార్టీల మధ్య వార్ మరింతగా ముదిరింది.  రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేసినా.. బీజేపీకి సీట్లు తగ్గిపోవడంతో... శివసేన బేరాలు చేయడం మొదలుపెట్టింది.  మంత్రిపదవులు, ముఖ్యమంత్రి పీఠం రెండింటిని చెరోసగం పంచుకోవాలని, ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు చేయాలని చేపట్టాలని శివసేన డిమాండ్ చేస్తున్నది.  

శివసేన డిమాండ్ కు బీజేపీ నో చెప్పిన సంగతి తెలిసిందే.  ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది.  శివసేన సైతం ఈ విషయంలో తగ్గేలా కనిపించడం లేదు.   అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది.  ఇదిలా ఉంటె, ముందుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి... తరువాత శివసేన పార్టీని దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.  ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... శివసేన మెత్తపడే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  అంతేకాదు, శివసేన పార్టీకి చెందిన 45 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు శివసేనపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని బీజేపీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.  త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.