మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంగతేంటి..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంగతేంటి..?

అఖిల్ అక్కినేని హీరోగా చెప్పుకోదగ్గ హిట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమా ఒక్కటి కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. అయితే తాజాగా అఖిల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్దె నటించారు. ఈ సినిమా చాలా కొత్త థీమ్‌తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విడుదల విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణాలుగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో నాగ్ సంతృప్తి చెందలేదని, అఖిల్ కెరీర్‌కి ఈ సినిమా ఎంత ముఖ్యమో గుర్తు ఉంచుకొని సినిమాను సరిచేయమని కొన్ని మార్పులు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసేందుకు చూస్తున్నారు. అందుకనే సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం. కారణం ఏదైనా ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.