కేరళ పరిస్థితే హైదరాబాద్ కు వస్తే..

కేరళ పరిస్థితే హైదరాబాద్ కు వస్తే..

ఇటీవల కేరళలో కురిసిన భారీ వర్షాలతో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది. అధిక జనాభాతో కిక్కిరిసిన పెద్ద నగరాల్లో ఒక రోజంతా కుండపోతగా వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఎన్డీఎంఏ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ నగరం పెను ప్రమాదంలో పడటం ఖాయమని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో వందలాది చెరువులు, కుంటలు కబ్జాకు గురైన కారణంగా 2000 సంవత్సరంలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంది. అలాంటి పరిస్థితే మళ్లీ వస్తే ఈసారి చాలా నష్టం సంభవిస్తుందని ఎన్డీఎంఏ అంచనా వేస్తోంది. అతి భారీ వర్షాలు కురిస్తే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొనే మెట్రో నగరాల్లో ఢిల్లీ, ముంబై తరువాత హైదరాబాదే ఉంది. ఈ అధ్యయనం ద్వారా ముందుజాగ్రత్త చర్యలకు ప్రభుత్వాలను, స్వచ్ఛంద సంస్థలను అలర్ట్ చేసి వరద నష్టాన్ని ఎలా తగ్గించవచ్చనే దానిపై దృష్టి సారించేలా చేయాలనేది ఎన్డీఎంఏ ఉద్దేశం.