భారత్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..!! 

భారత్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..!! 

భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతున్నది.  దానిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచదేశాలతో సంబంధాలను నెలకొల్పుతోంది.  ఇప్పటికే ఐరాసలోని సభ్యదేశాలతో ఇండియా అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతున్నది. అంతేకాదు, ప్రపంచంలోనే మూడో ఆర్ధిక శక్తిగా ఎదగబోతున్నది.  ఈ సమయంలో ఇండియాకు శాశ్వత సభ్యదేశంగా ఐరాస భద్రతా మండలి గుర్తించకపోవడంతో ఇండియా ఆవేదన వ్యక్తం చేస్తున్నది.  

ఐరాస కు ఎక్కువగా ఫండింగ్ చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి.  ఐరాసకు సంబంధించిన ప్రతి విషయంలో ఇండియా చురుగ్గా ఉంటున్నది.  ఐరాసలో ఆసియా దేశాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వలన దక్షిణ, మధ్య ఆసియా దేశాలు ప్రత్యేక కూటములుగా ఏర్పడుతున్నాయని, అది ఐరాస మనుగడకు మంచిది కాదని, ఆసియా దేశాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఇండియాకు శాశ్వత సభ్యదేశంగా గుర్తింపు ఇవ్వాలని ఇండియా డిమాండ్ చేస్తున్నది.  బహుశా భారత్ నెక్స్ట్ టార్గెట్ ఇదే అయ్యి ఉంటుంది.  ఈ దిశగానే ఇండియా పావులు కదుపుతున్నది.