అల్లు అర్జున్... సుకుమార్ సినిమా ఎందుకు స్టార్ట్ కాలేదు?

అల్లు అర్జున్... సుకుమార్ సినిమా ఎందుకు స్టార్ట్ కాలేదు?

అల్లు అర్జున్ 20 వ సినిమా మే 11 వ తేదీన ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈరోజు ప్రారంభం అవుతుందని అందరూ ఎదురు చూశారు.  కానీ, ఏమైందో ఏమో తెలియదుగాని, సినిమా స్టార్ట్ కాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వలన సినిమా ఓపెనింగ్ మే 11 నుంచి మే 15 కు వాయిదా వేశారని తెలుస్తోంది.  

అల్లు అర్జున్... సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ స్టోరీగా తెరకెక్కబోతున్నది.  సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ పూర్తిచేశాడు.  ఇందులో రష్మిక మందన్న హీరోయిన్.  ఇదిలా ఉంటె ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతున్నది.  జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  పూజా హెగ్డే, రష్మికలు హీరోయిన్లు.