వైరస్ వ్యాప్తికి ఇవి కారణం అవుతున్నాయా?   

వైరస్ వ్యాప్తికి ఇవి కారణం అవుతున్నాయా?   

కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది.  రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద స్థాయిలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.  అయితే, కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఆగడం లేదు.  కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నా కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది బయట తిరుగుతున్నారు.  తప్పనిసరి పరిస్థితుల్లో పూట గడిచేందుకు మార్గం లేకపోవడంతో బయట తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఫలితంగా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.  కొంతమంది కావాలని బయట తిరుగుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి.  బయటకు వెళ్లిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.  మాస్క్ ధరించడంతో పాటుగా శానిటైజర్ ను వినియోగించాలి.  కనీసం ప్రతి అరగంటకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  అప్పుడే కరోనాకు కొంతమేర చెక్ పెట్టె అవకాశం ఉన్నది.