రాహుల్.. పా.రంజిత్ భేటీ వెనుక కారణం..?

రాహుల్.. పా.రంజిత్ భేటీ వెనుక కారణం..?

పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన మద్రాస్, కబాలి, కాలా ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని పా రంజిత్ సినిమా చేస్తాడు అనే పేరు ఉంది.  ముంబైలోని ధారవి సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని కాలా ను రూపించాడు.  ఒక మంచి సినిమాగా ఇది పేరు తెచ్చుకుంది.  

 ఇదిలా ఉంటె, పా రంజిత్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మీట్ అయ్యారు.  ఈ మీటింగ్ లో సినిమా, రాజకీయ అంశాల గురించి చర్చించారట.  రంజిత్.. రాహుల్ గాంధీని ఎందుకు కలిసినట్టు.  దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా...? కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన అంశాలను పా రంజిత్ కు అప్పగించబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.  సామాజిక సమస్యలను తెరపై అద్భుతంగా చూపించగలిగే పా రంజిత్ ను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతున్నదా...? ప్రస్తుతానికి కేవలం ప్రశ్నలే.  సమాధానాలు కోసం కొంతకాలం వేచి ఉండక తప్పదు.