శైలజా రెడ్డి అల్లుడు వాయిదాకు అసలు కారణం ఏంటి..?

శైలజా రెడ్డి అల్లుడు వాయిదాకు అసలు కారణం ఏంటి..?

ఎలాగైతేనేం శైలజా రెడ్డి అల్లుడు పోస్ట్ ఫోన్ అయింది.  దీనికి కారణం రీ రికార్డింగ్ వర్క్ పెండింగ్ లో ఉందని.  గోపి సుందర్ చేస్తున్న వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని అందుకే సినిమా ఆగష్టు 31 న రావడం లేదని యూనిట్ ప్రకటించింది.  సెప్టెంబర్ 13 లేదా అంతకంటే ముందే సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

శైలజా రెడ్డి అల్లుడు సినిమా వాయిదా పడటానికి రీ రికార్డింగ్ వర్క్ కారణం కాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  మారుతికి గీతా ఆర్ట్స్ కు మంచి అనుబంధం ఉంది. ఈ సంస్థలో గతంలో మారుతి సినిమాలు చేశారు.  ఇప్పుడు ఈ సంస్థ నుంచి వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్టైంది.  మంచి కలెక్షన్లు వసూలు చేస్తున్నది.  మరో రెండు మూడు వారాల వరకు ప్రేక్షకులు ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.  ఈ సమయంలో మరో పెద్ద సినిమా వస్తే.. దానివలన గీత గోవిందం కలెక్షన్లు తగ్గుముఖం పెట్టె అవకాశం ఉంటుంది.  అండర్ స్టాండింగ్ మీదనే సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలియాలి.