రష్మిక.. ఆ టాటూ అర్ధం ఏంటో..?
చేతిమీద టాటూ వేయించుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో హిట్ అవుతున్నారా..? అంటే.. ఒకరకంగా అవుననే చెప్పాల్సి వస్తున్నది. సమంత చేతిమీద రెండు యారో గుర్తులు కలిగిన టాటూ ఉంటుంది. ఈ టాటూ అర్ధం ఏంటో నాగ చైతన్యకు తప్ప మనకు తెలియదు. ఇప్పుడు రష్మిక చేతిమీద ఓ టాటూ వేయించుకుంది. అది ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి అర్ధం చేసుకోవచ్చు. ఇర్రిప్లేసబుల్ అని రాసుంది. చివరి లక్ష్యం ఇ పైన ఒక చిన్న లవ్ సింబల్ వేసి ఉన్నది.
ఇర్రిప్లేసబుల్ అంటే ఇంపాజిబుల్ తో రిప్లేస్ అనే అర్ధం ఉంది. ఛలో సినిమాకు ముందు ఈ కన్నడ భామ రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. కెరీర్లో ఇప్పుడు మంచి సక్సెస్ అవుతుండటంతో.. సినిమాలపై దృష్టి సారించింది. ఇద్దరు ఒక అవగాహనతోనే బ్రేక్ అప్ అయ్యారు. ఇద్దరు బ్రేక్ అప్ అయ్యాక.. రష్మిక మొదటిసారిగా పాల్గొన్న పెద్ద ఈవెంట్ దేవదాస్ ఆడియో పార్టీ. ఈ పార్టీలో రష్మిక చేసిన హంగామా అంతాఇంతా కాదు. యువతరం కథానాయకులు ఆకట్టుకోవడానికి ఈ ఈవెంట్ ను రష్మిక బాగా వినియోగించుకుంది. వరసగా ఛలో, గీత గోవిందం సినిమాలు హిట్ కావడంతో పాటు దేవదాస్ కు కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో.. రష్మిక ఆనందంలో మునిగిపోయింది. ఈ సినిమా హిట్టయితే.. మరికొన్ని సినిమాలు తప్పకుండా వస్తాయి అనడంలో సందేహం లేదు. ఇన్ని చెప్పుకున్నా.. రష్మిక ఆ చేతిమీద అలాంటి టాటూ ఎందుకు వేయించుకుంది. అసలు ఏ అర్ధంతో ఆ టాటూ వేసుకుంది అనే విషయం మాత్రం తెలియడంలేదు. ఆ టాటూ గురించి ఈసారైనా రష్మిక చెప్తే బాగుంటుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)