కొత్త హీరోయిన్నా.. టాప్ హీరోయిన్నా..?

కొత్త హీరోయిన్నా.. టాప్ హీరోయిన్నా..?

ప్రతి సంవత్సరం టాలీవుడ్ కు అనేక మంది కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతున్నారు.  టాలెంట్ ఉన్న వాళ్ళు నిలబడుతున్నారు.  చిన్న చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలు కూడా అవకాశాలు అందిపుచ్చుకొని టాప్ స్థాయికి ఎదుగుతుంటే కొందరేమో టాప్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు.  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ సినిమాకు హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే సందేహంలో ఉన్నారట.  

టాప్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తూనే.. కొత్త హీరోయిన్ల కోసం వేట మొదలుపెట్టినట్టు సమాచారం.  రొమాంటిక్ జానర్లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.  త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఎలాంటి హిట్ సాధించాయో తెలిసిందే కదా.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.