మోడీని బాబు కలిస్తే తప్పేంటి..

మోడీని బాబు కలిస్తే తప్పేంటి..

ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబనాయుడు మర్యదపూర్వకంగా కలిస్తే ప్రధాన ప్రతిపక్షం రాద్దాంతం చేయడం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి పని లేక విమర్శలు చేస్తోందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలుగా తాము వెళ్లి సీఎంను కలుస్తుంటామని, అలానే ఆయన ప్రధానిని కలిశారని, ఇందులో తప్పేందని ప్రశ్నించారు. 'సీఎం ఇక్కడ పులి..ఢిల్లీలో పిల్లి' అని వైసీపీ విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యలను కూడా విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఇక.. తమ మద్దతు లేకుండా  2019లో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని ఆయన అన్నారు. బీజేపీ లేకపోతే నేడు టీడీపీ అధికారంలో ఉండేది కాదని, ఈసారి పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని విష్ణు చెప్పారు.