వాట్సాప్ కొత్త సేవ‌లు.. ఇక వారికి షాకే..!

వాట్సాప్ కొత్త సేవ‌లు.. ఇక వారికి షాకే..!

మెసేజింగ్ యాప్ వాట్సాప్  కొత్త సేవ‌ల‌ను ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది.. ఇప్ప‌టికే మెసేజ్‌, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న వాట్సాప్... ప్ర‌తీ స్మార్ట్‌ఫోన్‌లో ఇది త‌ప్ప‌నిస‌రి అనేంత‌వ‌ర‌కు వెళ్లింది.. ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల అభిరుచుల‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతూనే ఉంది.. ఇక‌.. త‌న యూజర్లకు మరో శుభవార్త చెప్పింది వాట్సాప్.. ఈ యాప్ ద్వారా.. ఇకపై ఇతరులకు డబ్బులు కూడా పంపించ‌వ‌చ్చు.. అంటే.. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాగా కూడా వాట్సాప్‌ను వాడేయొచ్చు.. వాట్సాప్‌ ద్వారా డబ్బులు సులువుగా పంపించ‌వ‌చ్చు. ఈ సేవ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా త్వ‌ర‌లోనే అందుబాటులోకి తేనున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌. అంతేకాదు ఆర్బీఐ డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా ఈ స‌ర్వీసులు ఉంటాయ‌ని.. దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని పేర్కొంది.. పేమెంట్ స‌ర్వీసుల‌ను అందించ‌డానికి.. అది కూడా ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఏడాది కాలంగా తమ టీమ్ కృషి చేస్తోంద‌ని ప్ర‌క‌టించింది వాట్సాప్.. తర్వలోనే అందరికీ పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.