వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌...

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌...

ఈ రోజుల్లో వాట్సాప్‌ వినియోగించని వారు ఉండరు. మెసేజ్‌, ఫొటో, వీడియోలు అన్ని కూడా వాట్సాప్‌ ద్వారానే ఇతరులతో పంచుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్‌ యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ నుండి పంపే మెసేజ్‌లను మరోసారి చూసుకునేందుకు వీలుగా 'ప్రివ్యూ' ఆప్షన్‌ త్వరలో రానుంది.

ప్రివ్యూ ఆప్షన్‌ ద్వారా వాట్సాప్‌ వినియోగదారులు ఓ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందే దాని ప్రివ్యూ చూసుకోవచ్చు. అంటే.. మెసేజ్‌, ఫొటో, వీడియోలు వంటి వాటిని అవతలి వారికి పంపే ముందు మరోసారి సరిచూసుకోవచ్చు. అంతేకాదు ఆ మెసేజ్‌లను సెండ్ చేయడం లేదా డిలీట్ చేయడం చేసుకోవచ్చు. మెసేజ్‌ ప్రివ్యూ సమయంలోనే.. ఫార్వర్డ్‌ మెసేజ్‌ల జాబితాలో మరికొంత మందిని ఎంపిక చేసుకోవచ్చు లేదా ఉన్నవారిలో ఎవరినైనా తొలగించవచ్చు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రివ్యూ ఆప్షన్‌ ఉపయోగపడుతుందట. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి రానుంది.