వాట్సాప్‌లో కొత్త ఫీచర్...

వాట్సాప్‌లో కొత్త ఫీచర్...

ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్ ఫీచర్స్ అందిస్తూ తన యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్... మరో అప్‌డేట్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ అప్లికేషన్‌లో తాజాగా గ్రూపు సెట్టింగ్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ గ్రూపులో సభ్యులుగా ఉన్నవారిలో అడ్మినే కాకుండా గ్రూపులోని సభ్యులంతా గ్రూపు ఇన్ఫో సెట్టింగ్స్‌లో ఐకాన్, డిస్ర్కిపిక్సన్‌ను తమకు నచ్చిన విధంగా మార్చుకునే వీలుండేది... కానీ, తాజాగా తెచ్చిన ఫీచర్‌తో గ్రూపులోని అందరి సభ్యులపై అడ్మిన్ మాత్రమే పరిమితి విధించవచ్చు. దీంతో గ్రూపు ఇన్ఫో సెట్టింగ్‌లోని ఐకాన్, డిస్ర్కిపిక్సన్ ఆ గ్రూపులోని సభ్యులు మార్చడానికి వీలుండదు. 

వాట్సాప్‌లోని ఈ తాజా ఫీచర్‌కు ఇటీవలే టెస్టింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ల్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండగా... త్వరలోనే ఈ కొత్త ఫీచర్‌ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్ ప్లాట్‌ఫాంలపై కూడా అందుబాటులోకి తేనున్నట్టు వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ గ్రూపు అడ్మిన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి... ఎడిట్ గ్రూపు అడ్మిన్స్ , గ్రూపు ఇన్ఫో ఆప్షన్‌లో గ్రూపు ఇన్ఫో ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆల్ పార్టిసిపెంట్స్ , ఓన్లీ అడ్మిన్స్ అనే రెండు ఆప్షన్లు ఉండగా... ఓన్లో అడ్మిన్స్ అనే ఆప్షన్ ఓకే చేస్తే... ఇక అడ్మిన్ మాత్రమే ఐకాన్, సమాచారాన్ని మార్చే వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్ అప్‌డేట్ చేస్తే చాలా... గ్రూప్‌లోని ప్రతీ సభ్యుడు అడ్మిన్‌తో సంబంధం లేకుండే మార్చే అవకాశానికి చెక్ పెట్టొచ్చు.