వైరల్: ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా?

వైరల్: ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా?

 రేపు కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు బీజేపీ నేతల మధ్య జరిగిన వాట్స్అప్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు బీజేపీ నేతలు సి.టి. రవి, శోభా కరండ్లజి మధ్య వివాస్పదమైన వాట్స్అప్ చాట్ జరిగింది. కర్ణాకట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్. యడ్యూరప్పకు ఎన్నికల విషయంలో స్వేచ్ఛను ఇవ్వనందు వల్లనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూస్తుందని ఆ ఇద్దరు అంటున్నారు.

సి.టి. రవి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాన్ని గురించి తన పార్టీ నాయకుడైన శోభాను వాట్స్అప్ చాట్ లో అడిగాడు. అందుకు సమాధానంగా.. ప్రధాని మోడీ ప్రచార ర్యాలీలు బీజేపీకి అంతగా ఉపయోగపడవు, 2014 లోక్ సభ ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం చేసిన మోడీ.. ఇపుడు కర్ణాటకలో ఆ జోష్ కోల్పోయాడని బదులిచ్చింది. ఇంకా సి.టి. రవి అడిగిన ప్రశ్నలకు శోభా సమాధానాలను ఇచ్చారు. వీరి చాట్ ప్రకారం.. ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.