వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌ను ఉపయోగించే యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ సంస్థ 'ఫార్వర్డెడ్‌ లేబుల్‌ ఫీచర్‌'ను లాంచ్‌ చేసింది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌లో ఫార్వర్డ్‌ మెసేజ్‌లకు ఒక లేబుల్‌ ఉంటుంది. దీంతో ఒరిజినల్ మెసేజ్‌లకు, ఫార్వర్డ్‌  మెసేజ్‌లకు తేడా తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌ను ఆక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియ అవసరం లేదు. వాట్సాప్‌ బీటా యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే.. ఈ ఫీచర్ ఆక్టివేట్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో ఫార్వర్డెడ్‌ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.