వినియోగదారులకు వాట్సాప్‌ షాక్‌ ..!

వినియోగదారులకు వాట్సాప్‌ షాక్‌ ..!

వాట్సాప్‌కు ఉన్నంత మంది యూజర్స్ మరే యాప్‌కు లేరనండంలో ఎలాంటి సందేహంలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌కి మరింత చేరువయింది వాట్సాప్‌. అయితే, ఈ సారి కాస్త భిన్నంగా కొత్త అప్‌డేట్‌తో యూజర్స్‌కి షాకివ్వబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీ నుంచి వాట్సాప్‌ కొత్త టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను తీసుకురానుంది. వీటిని అంగీకరించని యూజర్స్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను వాబీటాఇన్ఫో షేర్ చేసింది. అందులో కొత్త నిబంధనలను అంగీకరించండి లేదా మీ ఖాతాను డిలీట్ చేసుకోండి అని ఉంది. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ఇలా షాక్‌కు కూడా ఇస్తోందన్నమాట వాట్సాప్.