ఆర్ఆర్ఆర్ నుంచి మరో హాట్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ నుంచి మరో హాట్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శెరవేగంగా జరుగుతున్నది.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై సీన్స్ ను షూట్ చేస్తున్నారు. క్యాస్టింగ్ ను కూడా రీసెంట్ గా ప్రకటించారు.  హైదరాబాద్ షెడ్యూల్ తరువాత.... యూనిట్ కోల్ కతా వెళ్ళబోతున్నది.  అక్కడ నెలరోజులపాటు షూట్ జరుగుతుంది.  

ఇదిలా ఉంటె, ఇందులో రామ్ చరణ్ పక్కన అలియా భట్ హీరోయిన్.  అజయ్ దేవగణ్ కీలక పాత్ర చేస్తున్నారు.  అలియా, అజయ్ లు సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అనే విషయాలపై ఓ క్లారిటీ వచ్చింది.  ఈ బాలీవుడ్ నటులిద్దరు 2019 మిడిల్ నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.  అప్పటి వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తారట.  మరి ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎప్పుడు జాయిన్ ఆవుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.