డీయూ ఎన్నికల్లో ఆ ఈవీఎంలు ఎక్కడివి?

డీయూ ఎన్నికల్లో ఆ ఈవీఎంలు ఎక్కడివి?

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వాడిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఎన్నికల్లో ఈవీఎంలను కేంద్ర ఎలక్షన్ కమిషన్ గానీ, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గానీ సమకూర్చలేదని, మరలాంటప్పుడు ఏదో ఒక ప్రైవేటు ఏజెన్సీ నుంచి ఈవీఎంలు సమకూర్చుకునే హక్కు యూనివర్సిటీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. యూనివర్సిటీ పెద్దలు ప్రైవేటుగా తయారు చేయించారా? లేక కొనుగోలు చేశారా? ఏ పని చేసినా ఈసీకి తెలియకుండా చేయడం నేరం కాదా అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై  ఢిల్లీ యూనివర్సిటీ బాధ్యులనే సంప్రదించాలని ప్రయత్నించినా.. వారంతా ఎన్నికల ఫలితాల హడావుడిలో ఉన్నారని కేజ్రీవాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. అదే లేఖను ట్విట్టర్ లో పోస్టు చేయడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు.