ఏపీ అసెంబ్లీలో వంశి సీటు ఎక్కడా? 

ఏపీ అసెంబ్లీలో వంశి సీటు ఎక్కడా? 

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 2 వ తేదీ నుంచి జరగబోతున్నాయి.  ఈసారి జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.  తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఒకరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీకి మాత్రమే రాజీనామా చేశారుగాని, ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదని వల్లభనేని వంశి పేర్కొన్నారు.  అంటే శీతాకాల సమావేశాల్లో వంశి కూడా పాల్గొనే అవకాశం ఉన్నది.  

ఒకవేళ వంశి సమావేశాల్లో పాల్గొంటే... ఎక్కడ కూర్చుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది.  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి అక్కడ వాళ్లతో కలిసి కూర్చోలేరు.  వైకాపాలో జాయిన్ కాలేదు కాబట్టి అక్కడ కూర్చోలేడు.  ఇప్పుడు ఆయన సీటు ఎక్కడ అన్నది ప్రస్నార్ధకంగా మారింది.  ఇప్పుడు వంశి ఏ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్రుడిగా సింగిల్ గా కూర్చునే అవకాశం ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.