సైరాలో జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి..?

సైరాలో జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి..?

సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో భారీ ఎత్తున జరుగుతున్నది.  బ్రిటిష్ వాళ్లకు, సైరా సైనికులకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.  ఈ షూటింగ్లో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం.  ఈ సినిమా షూటింగ్ లో ప్రముఖ నటులైన జగపతి బాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి లు కూడా జాయిన్ అయ్యారు.  

జగపతి బాబు వరసగా విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు.  జగపతి బాబుకు విలన్ రోల్స్ బాగా కలిసి వస్తున్నాయి.  అద్భుతంగా చేస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ విలన్ గా జగపతి బాబు మారిపోయారు.  ఇప్పుడు సైరాలో జగపతిబాబు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.  సైరాలో కూడా జగపతి బాబు విలన్ రోల్ ప్లే చేస్తే బాగుంటుందని మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.