2021 సంక్రాంతి రేసులో నిలిచేదెవరు...?

2021 సంక్రాంతి రేసులో నిలిచేదెవరు...?

వచ్చే సంక్రాంతిపై చాలామంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు.  తమ సినిమాలను రెడీ చేసుకుంటున్నారు.  ఇంతలోనే రాజమౌళి అందరికి షాక్ ఇస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు.  ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ ఏడాది జులై 30 న కాకుండా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.  దీంతో పాపం వచ్చే ఏడాది సంక్రాంతికి కోసం సిద్ధం అవుతున్న సినిమాలన్ని కూడా ఆలోచనలో పడ్డాయి.  

రాజమౌళి సినిమాలకు మామూలుగానే క్రేజ్ ఉంటుంది.  ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా.  బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో నటిస్తున్నారు.  దాదాపుగా రూ. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది.  మహేష్, పవన్, అల్లు అర్జున్ సినిమాలను సంక్రాంతికి ప్లాన్ చేసుకోవాలని అనుకున్నారు.  కానీ, ఇప్పుడు రేస్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రావడంతో మిగతా సినిమాలు సంక్రాంతికి వస్తాయా లేదంటే సంక్రాంతి తరువాత రిలీజ్ అవుతాయా అన్నది చూడాలి.